Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఇంటెలిజెన్స్. పోలీసుల ఆరా
అ మద్దతు తెలిపిన బీజేపీ ,కాంగ్రెస్
నవతెలంగాణ-గణపురం
మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ముద్ర అగ్రికల్చర్ స్కిల్ డెవలప్మెంట మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఆఫీసు ఎదుట బాధితులు మంగళవారం ధర్నా చేశారు. వారికి బీజేపీ మండల అధ్యక్షుడు జిట్టబోయిన సాంబయ్య మంద మహేష్. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్, కోఆప్షన్ సభ్యుడు బోనాల రాజమౌళి మద్దతు తెలిపారు. మంగళవారం నవతెలంగాణలో ప్రచురితమైన 'నమ్మించి బోర్డు తిప్పేశారు' అనే వార్తకు ఇంటలిజెంట్స్, సివిల్ పోలీసులు స్పందించి ఆరా తీస్తున్నారు. ఈ సందర్బంగా బాధితులు గణపురం నగరంపల్లి గ్రామానికి చెందిననూతి భాగ్య, వెంగల సులోచన, నూతి వెంకటేశ్వర్లు, సింధు, రాజేందర్, పరుష రమ, మహేష్, రాజేందర్ మాట్లాడుతూ... బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బోర్డు పెట్టుకొని సంస్థను స్థాపించి కోటి రూపాయల వరకు ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని బ డిమాండ్ చేశారు. ఒక్కో బాధితుడు లక్ష రూపాయలు డిపాజిట్ చేశారని, వారికి తగిన న్యాయం చేయాలని కోరారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.