Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోషకాహర పునరావాస కేంద్రం ప్రారంభం
- కేంద్ర నీటి అయోగ్ వైస్ చైర్మెన్ డాక్టర్ రాజీవ్ కుమార్
నవతెలంగాణ-ములుగు
పోషకాహార లోపంతో బాధపడుతున్న గిరిజన చిన్నా రులను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారు చేయడమే లక్ష్యంగా పోషకాహార పునరావాస కేంద్రం ఏర్పాటు చేసినట్టు కేంద్ర నీటి ఆయోగ్ వైస్ చైర్మెన్ డాక్టర్ రాజీవ్ కుమార్ తెలిపారు. జిల్లా కేంద్ర శివారులో ఎన్స్ప్రేయర్ నేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాంలో భాగంగా నీతి అయోగ్ ద్వారా న్యూఢిల్లీకి చెందిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రాజెక్ట్ 2019-20 కేంద్ర నిధుల ద్వారా ఐటీడీఏ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన రూ.46 లక్షల వ్యయంతో చేపట్టి పూర్తి చేసిన న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్‌ను నీతి ఆయోగ్ వైస్ చైర్మెన్ డాక్టర్ రాజీవ్ కుమార్, డాక్టర్ రాజేశ్వరరావు, ప్రత్యేక కార్యదర్శి రాకేష్ రంజన్‌లతో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజీవ్‌కుమార్ మాట్లాడారు. జిల్లాలో అత్యధిక భాగం గిరిజన ప్రాంతమైన నేపథ్యంలో అవగాహన లేమితో గర్భిణులు రక్తహీనతతో ఉంటారని, పిల్లలు బలహీనంగా ఉంటారని చెప్పారు. అలాంటి వారికి ప్రభుత్వం పోషకా హార పునరావాస కేంద్రం ద్వారా నాణ్యమైన పౌష్టికాహారం అందించడంతోపాటు అవసరమైన వైద్యసాయం అందిస్తుం దని తెలిపారు. అనంతరం ప్రేంనగర్లోని అంగన్వాడీ సెంటర్‌ను రాజీవ్‌కుమార్ బృందం సందర్శించగా బాలలు పూలమాలలతో స్వాగతం పలికారు. అంగన్వాడీ కేంద్ర నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. పిల్లల్లో చైతన్యం తీసుకొచ్చేలా చిత్రాల రూపంలో బొమ్మలతో అవగాహన కల్పించాలని సూచించారు. తొలుత రాజీవ్‌కుమార్ బృందా నికి ఐటీడీఏ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో ములుగు, భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు కృష్ణ ఆదిత్య, భవిష్ మిశ్రా, భద్రాచలం ఐటీడీఏ పీఓ గౌతమ్ పోట్రు, అదనపు కలెక్టర్లు ఇలా త్రిపాఠీ, దివాకర్, తదితరులు పాల్గొన్నారు.
రామప్ప కాకతీయుల శిల్పకళకు ప్రతీక
వెంకటాపూర్ మండలంలోని రామప్ప ఆలయాన్ని కాకతీయుల శిల్పకళా నైపుణ్యానికి ప్రతీకగా నీటి ఆయోగ్ వైస్ చైర్మెన్ రాజీవ్‌కుమార్ అన్నారు. ఆయన ఆధ్వర్యంలోని నీటి ఆయోగ్ బృందం రామప్ప ఆలయాన్ని సందర్శించగా దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికి పూజలు చేయించారు. అనంతరం రామప్ప శిల్ప కళా విశిష్టతను గైడ్ విజరు వివరించారు. అనంతరం దేవాదాయ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆధ్వర్యంలో నీతి అయోగ్ సభ్యు లకు మెమొంటోలు శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో భూపాలపల్లి కలెక్టర్ భవేష్ మిశ్రా, భద్రాచలం ఐటీడీఏ పీఓ గౌతమ్ పోట్రు, అదనపు కలెక్టర్లు ఇలా త్రిపాఠీ, దివాకర, తదితరులు పాల్గొన్నారు.