Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
మహిళలు సఖి కేంద్ర సేవలను వినియోగించు కోవాలని కౌన్సిలర్ స్రవంతి కోరారు. స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా తలపెట్టిన అంతర్జాతీయ పక్షోత్సవాల్లో భాగం గా జిల్లా కేంద్రంలోని సఖి సెటర ఆధ్వర్యంలో కాపువాడ, గొల్లవాడల్లోని మహిళలకు బుధవారం అవగాహన కల్పిం చారు. ఈ సందర్భంగా స్రవంతి మాట్లాడారు. హింసకు గురైన మహిళలకు సహాయం అందేందుకు ఏర్పాటైన సఖి వన్ స్టాప్ సెంటర్ జిల్లాలో బాధిత మహిళలకు, 230 మందికిపైగా బాలికలకు సహాయం అందించినట్లు తెలిపారు. గృహ హింస, వరకట్న వేధింపులు, లైంగిక హింస, పని ప్రదేశాల్లో వేధింపులు, ఆడపిల్లల అక్రమ రవాణా నివారణ, తదితరాల కోసం 7013745008 8715295181, 181 నెంబర్లను సంప్రదించాలని సూచించారు. సఖి సెంటర్ ద్వారా కౌన్సిలింగ్, న్యాయం, వైద్య, పోలీసు సాయాలతోపాటు తాత్కాలిక వసతి, తదితర సేవలను వివరించారు. కార్యక్రమంలో సెంటర్ కౌన్సిలర్లు కల్పన, కేస్ వర్కర్ సాధన, తదితరులు పాల్గొన్నారు.