Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క
- పేదలకు దుప్పట్లు పంపిణీ
- పార్టీలో పలువురి చేరిక
నవతెలంగాణ-ఏటూరునాగారం
కాంగ్రెస్ హయాంలోనే ప్రజలకు సుపరిపాలన అందిందని ఆ పార్టీ జాతీయ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క స్పష్టం చేశారు. మండలంలోని గోవిందరావు కాలనీ, గొత్తికోయగూడెం, కొండాయి, దొడ్ల, దొడ్ల కొత్తూరు, శాపల్లి, శాపల్లి గొత్తికోయగూడెంలకు చెందిన సుమారు 900 మంది పేదలకు సీతక్క బుధవారం దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన చేల శమంతకుమారి, బండి రమ్య, సునీత, ఉమాదేవి, సమ్మయ్య, తదితరులు కాంగ్రెస్‌లో చేరగా సీతక్క కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ పాలనలో పేదల సంక్షేమం కోసం పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సమర్ధవంతంగా అమలు చేసినట్టు తెలిపారు. భవిష్యత్‌లో కాంగ్రెస్ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ అయూబ్ ఖాన్, మండల అధ్యక్షుడు చిటమట రఘు, మండల ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య, ఎంపీటీసీ గుడ్ల శ్రీలత దేవేందర్, జిల్లా సీనియర్ నాయకులు ఖలీల్ ఖాన్, వీసం వీరన్న, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌస్, సహకార సంఘం వైస్ చైర్మెన్ బాలరాజు, ఉపసర్పంచ్ కర్ల అరుణ, టౌన్ అధ్యక్షులు తాళ్లపెల్లి నరేందర్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు చేల వినరు, పీఏసీఎస్ డైరెక్టర్ వంగపండ్ల రవి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వసంత శ్రీను, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు గద్దల నవీన్, రాజబాబు, మహిళ నాయకురాలు కట్కురి రాధిక, వార్డు సభ్యులు హన్మంతు, భాగ్య, సర్దార్ పాషా, ముద్రబోయిన రఘు, కుక్కల రాములు, దురిపాటి కుమారస్వామి, ఈసం జనార్ధన్, సనప కిరణ్, సోదరి పోషయ్య, సాధనపల్లి లక్ష్మయ్య, దబ్బకట్ల సత్యనారయణ, మహేష్, లక్ష్మణ్‌రావు, తదితరులు పాల్గొన్నారు.