Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
ఈ ఏడాది మిర్చి పైర్లకు విపరీతమైన తెగుళ్లు సోకడం తో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఎకరానికి రూ.50 వేలు చొప్పున పరిహారం అందించి ఆదుకోవాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య డిమాండ్ చేశారు. మండలంలోని ఏజెన్సీ గ్రామాల్లోని బాధిత రైతుల తోటలను పార్టీ నాయకులతో కలిసి బుధ వారం ఆయన సందర్శించారు. కారుకొండలో తోటల పరిశీ లన అనంతరం మాట్లాడారు. మిర్చికి మంచి ధర ఉంటుం దని ఆశించిన రైతులు ఈ ఏడాది ఎక్కువ మొత్తంలో సాగు చేశారని తెలిపారు. గతంలో లేనంతగా చీడ పీడలు, తెగుళ్లు సోకి పంటలు ధ్వంసమయ్యాయని చెప్పారు. తామర పురుగు బారిన పడ్డ మిర్చి తోటలను రైతులు పీకేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. లక్షలాది రూపాయల పెట్టుబడులు పెట్టిన మిర్చి రైతులు దివాళా తీశారని తెలపారు. ప్రకతి వైపరీత్యంగా భావించి రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖాధికారులు మిర్చి తెగుళ్ల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆకాంక్షించారు. వ్యవసాయ అధికారులు మిర్చి తోటల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు మోకాళ్ల మురళీకష్ణ, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు సనప పొమ్మయ్య, మండల కార్యదర్శి బానోత్ నర్సింహ, నాయకులు పూనెం లింగయ్య, పాయం సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.