Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనారోగ్యాలకు గురవుతున్న పట్టించుకోని అధికారులు..
సీపీఐ(ఎం) సౌత్ జోన్ కార్యదర్శి మంద సంపత్
నవతెలంగాణ-హన్మకొండ
పశ్చిమ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో డ్రెయినేజీ వ్యవస్థ అధ్వాన్నంగా ఉందని, వెంటనే మురికి కాలువలను శుభ్రం చేయించాలని సీపీఐ(ఎం) సౌత్ జోన్ కార్యదర్శి మంద సంపత్ తెలిపారు. బుధవారం పార్టీ ఆధ్వర్యంలో 49, 50, 31, 30, 7, 10డివిజన్స్లలో స్థానిక సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతాల్లో సైడ్ డ్రెయినేజీలు లేక దోమలు, ఈగలు వ్యాప్తి చెంది ప్రజలు అనేక వ్యాధులకు గురవుతున్నారని వాపోయారు. అంతే కాకుండా మున్సిపల్ సమావేశాలలో ఆమోదం పొందిన పనులు పూర్తి చేయడంలో కూడా అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని విమర్శించారు. అలాగే ఏషియన్ శ్రీదేవీ మాల్ సమీపంలోని సాయిబాబా ఆలయం సమీపంలో చెత్తా, చెదారం పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోందని మండిపడ్డారు. దీంతో ఆ పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. వెంటనే అధికారులు సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేకుంటే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మేకల రఘుపతి, కంచర్ల కుమారస్వామి, సునీత, భాగ్య, కళ, రాధ పాల్గొన్నారు.