Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెక్కొండ రూరల్
నిజామాబాద్ జిల్లాలో అక్రమ ఇసుక రవాణాలో వీఆర్ఏను కొట్టి హత్యచేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని వీఆర్ఏలు డిమాండ్ చేశారు. వీఆర్ఏ హత్య నిందితులను శిక్షించాలని, వీఆర్ఏలకు పేస్కేల్ అమలు చేయాలని వారు తహసీల్దార్ వెంకన్నకు బుధవారం వినతిపత్రమిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అతితక్కువ వేతనంలో మొయలేని పనిభారాన్ని మోస్తూ విధులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం అసెంబ్లీలో వీఆర్ఏలకు పేస్కేల్ అమలు చేస్తామనే ప్రకటను తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏలకు విధులకు సమయపాలన లేదని, విధులకు సమయపాలన నిర్ణయించాలని, విధుల్లో మరణించిన వీఆర్ఏల కుటుంబాలకు ప్రభుత్వం మరోశాఖలో ఉద్యోగమిచ్చి ఆదుకోవాలన్నారు. ప్రభుత్వ హమీలు ప్రకటనలకే పరిమితమయ్యాయని, తక్షనం పేస్కేల్తోపాటు పెండింగ్ సమస్యలను పరిష్కరి ంచాలన్నారు. కార్యక్రమంలో వీఆర్ఏలు రాజేష్, నాగరాజు, రవి, సహార, అనిల్, బాబు, రమేష్, నర్సయ్య, కుమార్, కాసీం పాల్గొన్నారు.