Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ బీ గోపి
నవతెలంగాణ-వర్ధన్నపేట
యాసంగిలో వరికి బదులుగా రైతులు ఇతర పంటలు సాగు చేసుకోవాలని వరంగల్ కలెక్టర్ గోపి సూచించారు. బుధవారం ఇల్లంద, వర్ధన్నపేట పరిధిలోని వ్యాక్సినేషన్ సెంటర్లు, ప్రభుత్వ పాఠశాలలను, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. అనంతరం పట్టణ కేంద్రంలోని కొనుగోలు కెేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం యాసంగిలో వరి కొనుగోలు చేయడం లేనందున ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదన్నారు. రైతులు ఇతర పంటల సాగుపై దష్టి సారించాలని ఆయన కోరారు. ఒకవేళ రైతు ఇంటి అవసరాల నిమిత్తం, సీడ్స్ కంపెనీలకు గానీ, రైస్ మిల్లులకు గానీ నేరుగా విక్రయించుకోవాలనుకునే వారు మాత్రమే వరిని సాగు చేసుకోవాలన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని, ఏదైనా అనుమానాలుంటే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి అనుమానాలను నివత్తి చేసుకోవాలని సూచించారు.
ప్రజలు అపోహలు వీడి వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాలని కలెక్టర్ గోపి ప్రజలకు సూచించారు. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించుకుండా ప్రజలు జాగ్రత్తలు వహించాలన్నారు. తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని సూచించారు. కరోనాపై ఎలాంటి వదంతులు నమ్మవద్దని, ప్రజలు స్వయం నియంత్రణతో ఎదిరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అరుణ, ఎంపీపీ అప్పారావు, జెడ్పీటీసీ మార్గం బిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ రాజేష్ కన్నా, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ మోహన్ రావు, వ్యవసాయ శాఖ జేడీఏ ఉషా దయాల్, తహశీల్దార్ నాగరాజు, ఏడీఏ సురేష్, ఎంఏఓ రాంనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.