Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ హరిసింగ్
నవతెలంగాణ-సంగెం
కొనుగోలు కేంద్రాలలో రైతుల ధాన్యాలను కొనే సందర్భంగా ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ హరిసింగ్ హెచ్చరించారు. కాపులకనపర్తిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వరిధాన్యంలో తేమ శాతం 17 లోపు ఉంటేనే మిల్లర్లకు పంపాలని సూచించారు. వరి కొనుగోలు కేంద్రం రికార్డులను, తక్ పట్టీలను ఆయన తనిఖీ చేశారు. రైతులకు తొందరగా డబ్బులు పడేటట్లు వివరాలను అప్లోడ్ చేయాలని సూచించారు. రైతులు యాసంగి సీజన్ లో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని కోరారు. అలాగే కరోనా వ్యాక్సిన్ను అందరూ రెండు డోసులు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఓ దుర్గ భవాని, డీిఎం భాస్కర్ రావు, డీటీ సంధ్యారాణి, క్వాలిటీ కంట్రోలర్ రాజయ్య, గ్రామ కార్యదర్శి, ఏఈఓ, సీఈవో రమణాచారి, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.