Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర నీటి అయోగ్ వైస్ చైర్మెన్ డాక్టర్ రాజీవ్‌కుమార్
నవతెలంగాణ-ములుగు
ములుగు, భూపాలపల్లి జిల్లాల సమగ్ర అభివృద్ధికి పట్టుదలతో పని చేయాలని నీటి ఆయోగ్ వైస్ చైర్మెన్ డాక్టర్ రాజీవ్‌కుమార్ కోరారు. కేంద్ర నీటి అయోగ్ సభ్యులు డాక్టర్ రాజేశ్వర్‌రావు, నీరజ్ సింహా, రాజేష్ రంజన్‌తో కలిసి జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా రాజీవ్‌కుమార్ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలు లో కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధ్యక్షతన బుధవారం నిర్వహించిన సమావేశంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా రాజీవ్‌కుమార్ మాట్లాడారు. జిల్లా ప్రత్యేక పర్యాటక ప్రాంతం గా విలసిల్లుతోందన్నారు. సుపరిపాలన దిశగా అభివద్ధిలో అగ్రగామిగా నిలుస్తోందని చెప్పారు. గిరిజన ఆరాధ్యదైవమైన సమ్మక్క సారలమ్మ ఆలయాలకు నిలయమని, గోదావరి పరివాహక ప్రాంతంలో రైతులు సమద్ధిగా పంటలు పండించుకుని అభివద్ధి చెందుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. రైతులకు సేంద్రియ విధానంలో పంటల సాగుపై అవగాహన కల్పించాలని చెప్పారు. తద్వారా ఆరోగ్యవంతమైన సమా జాన్ని నిర్మించవచ్చని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన పౌష్టికాహారం అందుతోందన్నారు. నీటి ఆయోగ్ ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ రాజేశ్వరరావు వచ్చే 20 ఏండ్లలో విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యానవనం భారీగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ములుగు, భూపాలపల్లి జిల్లా లను ఢిల్లీ కేంద్రంగా దత్తత తీసుకొని నీటి అయోగ్ కేంద్రం ద్వారా అనేక అభివద్ధి కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తా మని చెప్పారు. జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పని చేయాలని, అభివద్ధిలో స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. భద్రాచలం ఐటీడీఏ పీఓ గౌతమ్ పోట్రు మాట్లాడుతూ ఐటీడీఏ ద్వారా ఆశ్రమ, ప్రాథమిక పాఠశాలలు, గురు కులాల ద్వారా గిరిజన విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో వసతులు కల్పించి మెరుగైన ఉచిత విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటున్నా మని చెప్పారు. తొలుత జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య పరిపాలన, అభివృద్ధిపై వివరించారు. జిల్లా పూర్తిగా గిరిజన ప్రాంతమని చెప్పారు. వనరులను సక్రమంగా వినియోగించుకుని ఆరోగ్యం, పోషణ, విద్య, వ్యవసాయం, నీటి వనరులు, ఆర్థిక, నైపుణ్య అభివద్ధి, ప్రాథమిక మౌలిక సదుపాయాల నిధుల వినియోగంలో సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని జిల్లా ప్రథమ స్థానంలో నిలిచేలా చొరవ తీసుకుంటున్నట్టు తెలిపారు. సదరు విషయాలపై నీటి ఆయోగ్ కోఆర్డినేటర్ రాహుల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, దేవాదాయ శాఖ ఈఓ రాజేందర్, మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రధాన పూజారి జగ్గారావులతో కలిసి నీటి అయోగ్ సభ్యులను మెమెంటోలు, శాలువాలతో సత్కరించి ప్రసాదం అందించారు. కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, భద్రాచలం ఐటీడీఏ పీఓ గౌతమ్ పోట్రు, ములుగు అదనపు కలెక్టర్ ఇలా త్రిపాటి, ములుగు ఏఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్, భూపాలపల్లి అదనపు కలెక్టర్ దివాకర, డీఆర్వో రమాదేవి, రెండు జిల్లాల అధికారులు పాల్గొన్నారు.