Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గూడూరు
గ్రామాలలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ తెలిపారు. మండలంలోని కోబల్‌తండా, మరిమిట్ట, లైన్‌తండా గ్రామాల్లో బుధవారం 'మన ఊరు-మన ఎమ్మెల్యే' కార్యక్రమం నిర్వహించగా ఎమ్మెల్యే ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షాన నిలుస్తోందని చెప్పారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం పాటుపడుతున్నట్టు తెలిపారు. అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. గత పాలకుల హయాంలో సమస్యలు పేరుకుపోగా స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పలు సమస్యలను పరిష్కరించినట్టు తెలిపారు. గ్రామాల్లోని స్వల్ప సమస్యలను స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి పరిష్కరించే దిశగా చొరవ చూపాలన్నారు. దరఖాస్తుదారులకు పింఛన్ అందుతుందని, ఇతర సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. మండల అధికారులు సమస్యలను పరిష్కరించే దిశగా పర్యవేక్షించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ భానోత్ సుజాత మోతీలాల్ నాయక్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వేం వెంకటకృష్ణారెడ్డి, తహసీల్దార్ శైలజ, ఎంపీడీఓ విజయలక్ష్మి ఎంపీఓ ప్రసాదరావు, తదితరులు పాల్గొన్నారు.