Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహాముత్తారం
రైతులు ఆరుతడి పంటలు పండించాలని ఏఈఓ పొడెం పుష్పలత కోరారు. మండలంలోని నల్లగుంట, మీనాజీపేట, నర్సింగాపూర్, కిష్టాపూర్ గ్రామాల్లో రైతులకు గురువారం అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈఓ పుష్పలత మాట్లాడారు. యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు పండించాలని సూచించారు. యాసంగిలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడానికి నిరాకరించిన క్రమంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని చెప్పారు. కంపెనీలతో ఒప్పందం, సొంత అవసరాల కోసం రైతులు వరి సాగు చేయొచ్చని తెలిపారు. డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయడం ద్వారా పంటకు సరైన ధర లభిస్తుందని తెలిపారు. అనంతరం రైతులకు 'యాసంగిలో వరికి బదులు ఇతర పంటల సాగు-యాజమాన్య పద్ధతులు' బుక్లెట్లు అందించి వాల్పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు ముత్యాల రాజు, లక్కిరెడ్డి శ్రీనివాస్, రైతుబంధు సమితి అధ్యక్షుడు వెల్మరెడ్డి మధూకర్రెడ్డి, నర్సంగాపూర్ కార్యదర్శి సికిందర్, తదితరులు పాల్గొన్నారు.