Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏఎమ్మార్ హెడ్‌కు భూనిర్వాసితుల వినతి
నవతెలంగాణ-మల్హర్రావు
తాడిచెర్ల మానేరుపై తాత్కాలికంగా మట్టి రోడ్డు నిర్మించాలని కోరుతూ భూనిర్వాసితుల కమిటీ అధ్యక్షుడు దండు రమేష్, కార్యదర్శి అక్కపాక సమ్మయ్య, సర్పంచ్ సుంకరి సత్తయ్య, ఉపసర్పంచ్ చంద్రయ్య ఏఎమ్మార్ కంపెనీ ప్రాజెక్ట్ హెడ్ ప్రభాకర్‌రెడ్డికి గురువారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రమేష్, సమ్మయ్య, సత్తయ్య, చంద్రయ్య మాట్లాడారు. మానేరుపై 200 నుంచి 300 మీటర్ల మేర తాత్కాలిక మట్టి రోడ్డు వేస్తే మండలంలోని తాడిచెర్ల, మల్లారం, పెద్దతూండ్ల, చిన్నతూండ్ల, అడ్వాలపల్లి, దుబ్బపేట, గాదంపల్లి, కిషన్‌రావుపల్లి గ్రామాల ప్రజలకు ఆర్నెళ్లపాటు మంథని, ముత్తారం వెళ్లడానికి దూరభారం తగ్గడమే కాకుండా ఓసీపీలో పని చేస్తున్న ఉద్యోగులకు రవాణ సౌకర్యం కలుగుతుందని తెలిపారు. రెండు, మూడేండ్లుగా మానేరుపై బ్రడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో తాత్కాలిక మట్టి రోడ్డు వేయడం ద్వారా పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల ప్రజలకు మెరుగైన రవాణ సౌకర్యం ఏర్పడుతుందని చెప్పారు. కార్యక్రమంలో అజ్మత్ అలీ, కేశారపు చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.