Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
టైల్స్ వర్కర్స్ యూనియన్ మాజీ నాయకుడు గుండాబత్తుల సుబ్బారావుకు న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు జోహార్లు అర్పించారు. సుమారు 40 ఏండ్ల క్రితం తూర్పుగోదావరి జిల్లా చింతలపల్లి నుంచి వచ్చి గంధంపల్లి కొత్తపేటలో స్థిరపడిన గుండాబత్తుల సుబ్బారావు గురువారం మధ్యాహ్నం గుండెపోటుతో మతి చెందారు. టైల్స్ ఫ్యాక్టరీలో గుమస్తాగా చేరిన ఆయన ఏపీ టైల్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకుడిగా బాధ్యతలు నిర్వహించారు. కామ్రేడ్ ముఖ్తార్ పాషాకు సన్నిహితుడు. తర్వాత ఇటుకల బట్టి పెట్టుకుని ఆరంగంలో స్థిరపడిన ఆయన మొదటి నుంచి చివరి దాకా న్యూడెమోక్రసీకి గట్టి మద్దతుదారుగా ఉన్నాడని తెలిపారు. పార్టీ కార్యకర్తలకు, సానుభూతిపరులకు సాయం చేశాడని గుర్తు చేశారు. సుబ్బారావుకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. పార్టీ, ప్రజాసంఘాల నాయకులు గౌని ఐలయ్య, ఏపూరి వీరభద్రం, రామగిరి భిక్షమ్, తుడుం వీరభద్రం, కూనూరి యుగంధర్ తదితరులు సుబ్బారావు మతదేహంపై పూలు చల్లి నివాళ్లర్పించారు.