Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని లక్నవరం చెరువు కింద రబీ సాగు కోసం ఆరుతడి పంటలకు నీరందించేలా తీర్మానం చేసినట్లు నీటిపారుదల శాఖ డీఈ శ్రీనివాస్ తెలిపారు. మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ రమాదేవి అధ్యక్షతన గురువారం రబీ తైబందీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈ శ్రీనివాస్ మాట్లాడారు. రబీలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించిన క్రమంలో చెరువు కిందున్న కాల్వల నుంచి ఆరుతడి పంటల సాగు కోసం నీరందించాలని కోరినట్టు తెలిపారు. అలాగే ఈ ఏడాది రబీ సాగు రొటేషన్‌లో ఉన్న నర్సింహుల కాల్వ పరిధిలోని 3 వేల రెండొందల ఎకరాలకు వచ్చే ఏడాది రబీలో రొటేషన్ కిందకొచ్చేలా రైతులు ఏకగ్రీవంగా తీర్మానించారని చెప్పారు. ఇకపై రైతులు రబీలో ఆరుతడి పంటల సాగుపై దష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో ఏఓ జితేందర్‌రెడ్డి, చల్వాయి సర్పంచ్ ఈసం సమ్మయ్య, జెడ్పీటీసీ తుమ్మల హరిబాబు, గూడూరు శ్రీనివాసరావు, కీర్తి రవి, గోపీ, నాగార్జున, వెంకటేశ్వర్రావు, భూక్యా దేవా, నర్సింహారావు, తదితరులు పాల్గొన్నారు.