Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-విలేకరులు
త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్‌కు మలుగు, భూపాలపల్లి జయశంకర్, మహబూబాబాద్ జిల్లాల వ్యాప్తంగా రాజకీయ పార్టీల నాయకులు, వివిధ సంఘాలు బుధవారం ఘనంగా నివాళ్లర్పించాయి. రావత్ మృతి దేశానికి తీరని లోటని నాయకులు అన్నారు.
భూపాలపల్లి : త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి గండ్ర సత్యనారాయణరావు గురువారం పూలమాల వేసి నివాళ్లర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. బిపిన్ రావత్ దేశానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. బిపిన్ రావత్ మృతి బాధాకరమన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ అర్బన్ అధ్యక్షుడు దేవన్, కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్, వేణుగోపాల్, సదయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు రాజేందర్, తోట రంజిత్, మహేందర్, విజరు, పథ్వి, తిరుపతి, రజనీకాంత్, రాకేష్, వేణు, వెంకన్న, సంతోష్, రాజు, రమణచారి తదితరులు పాల్గొన్నారు.
మంగపేట : కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు బిపిన్ రావత్ చిత్రపటానికి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు మైల జయరాంరెడ్డి, మండల ఉపాద్యక్షులు తూడి భగవాన్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి అయ్యోరి యానయ్య, మండల్ యూత్ కాంగ్రెస్ అద్యక్షులు మురుకుట్ల నరేందర్, కిసాన్ సెల్ మండల అద్యక్షులు చౌలం వెంకటేశ్వర్లు, మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు ఛాద మల్లయ్య, బిసి సెల్ అధ్యక్షులు ముత్తినేని ఆదినారాయణ, మండల మైనారిటి అద్యక్షులు హిదాయతుల్లా, తదితరులు పాల్గొన్నారు
కొత్తగూడ : కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో బిపిన్ రావత్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షుడు వజ్జ సారయ్య మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ బానోత్ విజయ రూప్ సింగ్,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకరబోయిన మొగిలి,మండలపార్టీ నాయకులు సంగి సంపత్, బోనగిరి యాకయ్య, హంస వెంకట నారాయణ, బాణోత్ వినోద్ రేవంత్, బూర్క నరేందర్, తదితరులు పాల్గొన్నారు.