Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏటూరునాగారం
రాష్ట్రీయ బాలస్వాస్త్య కార్యక్రమ్లో మండలంలోని పప్కాపురం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మొబైల్ టీమ్ మెడికల్ ఆఫీసర్ సుజాత, ఫార్మసిస్ట్ భాస్కర్, ఏఎన్ఎం రజనీకుమారి ఆధ్వర్యంలో గురువారం సుమారు 50 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సుజాత మాట్లాడారు. దగ్గు, తలనొప్పి, జ్వరం, తదితర సమస్యలుంటే ఆస్పత్రిలో చూపించుకోవాలని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. లేనిపక్షంలో ఈగలు, దోమలు ప్రబలి మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, తదితర జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉందన్నారు. ప్రధానోపాధ్యాయుడు మహమ్మద్ సర్వర్ అహ్మద్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం రాష్ట్రీయ బాలస్వాస్త్య కార్యక్రమం చేపట్టిందన్నారు. విద్యార్థులకు వైద్యసేవలు ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపారు.