Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ప్రారంభం
నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
ఏఐసీసీ అధ్యక్షరాలు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి సభ్యత్వ సభ్యత్వ నమోదును ప్రారంభించి మాట్లాడారు. మండలం, డివిజన్ లోని ప్రతీ బూత్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు. అనంతరం 53వ డివిజన్‌కు చెందిన 50మంది బీజేపీ వారూ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
నవతెలంగాణ-కాశిబుగ్గ
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను గురువారం వరంగల్ వెంకట్రామ జంక్షన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి పీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాష్ హాజరై మాట్లాడారు. సోనియాగాంధీ తన జన్మదిన కానుకగా డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు గురించి తొలి ప్రకటన చేశారని గుర్తు చేశారు అనంతరం పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు రంజిత్, నాయకులు సదానందం, సుధాకర్, భాస్కర్, ప్రభాకర్, వెంకటేశ్వర్ రావు, సంతోష్, అన్వేష్ పాల్గొన్నారు.
నవతెలంగాణ-గీసుకొండ
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదిన వేడుకలను గురువారం గొర్రెకుంట, మొగిలిచర్ల, రెడ్డిపాలెం గ్రామాల్లో 15వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎలగొండ.ప్రవీణ్లి అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొండేటి కొమురారెడ్డి, మాజీ ఎంపీటీసీ పసునూటీ క్రిష్ణరెడ్డి, మాజీ సర్పంచ్ మ్యాదరబోయిన.చక్రపాణి పాల్గొన్నారు.
నవతెలంగాణ - ఖానాపురం
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా మండల కేంద్రంలో సర్పంచ్ శాఖమూరి చిరంజీవి హరిబాబు ఇంటి వద్ద గురువారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముందుగా బిపిన్‌రావత్‌కు మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆధ్వర్యంలో సంతాపం తెలియజేశారు. కార్యక్రమంలో నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యడ్ల జగన్మోహన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వేములపల్లి వెంకటప్రసాద్ రావు, మండల మహిళా అధ్యక్షురాలు మందలపు పార్వతి, మంగలవారిపేట ఎంపీటీసీ మూడు పూల్ సింగ్, మాజీ ఎంపీపీ తక్కళ్లపెళ్లి రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-నెక్కొండ రూరల్
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదిన వేడుకలను గురువారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక విశ్రాంతి భవనంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బక్కి అశోక్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపటారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదును ప్రారంభించారు. అనంతరం త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్‌తో సహా 13 మందికి మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు హరిప్రసాద్, నెక్కొండ మాజీ జెడ్పీటీసీ బక్కి కవిత, సర్పంచులు గీతభాస్కర్, సరితతిరుమల్, ఎంపీటీసీ మాలోత్ రవి, మండల, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి , ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-బచ్చన్నపేట
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా గురువారం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమనికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. సభ్యత్వం తీసుకున్న వారికీ రెండు లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించనున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ శాఖ అధ్యక్షుడు కోడూరి మహాత్మా చారి, ఎంపీటీసీ నల్ల గోని పుష్ప, బాలకిషన్ గౌడ్, సందేలా రాము, పంది పెళ్లి నర్సింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.