Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బచ్చన్నపేట
పోచన్నపేట గ్రామానికి చెందిన బాలమైసయ్య-ఎల్లమ్మల కూతురు రేఖ వివాహానికి బీజేపీ నాయకుడు, సామాజిక సేవాకర్త ముక్కెర తిరుపతి రెడ్డి పుస్తె, మట్టెలు అందజేసి అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ఎలికట్టే మహేందర్ గౌడ్, మండలాధ్యక్షుడు సద్ది సోమిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి జూకంటి గణేష్, బూత్ అధ్యక్షుడు శ్రీపతి చిరంజీవి, జంద్యాల సురేష్ తదితరులు పాల్గొన్నారు.