Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
అయ్యప్ప పంబారట్ మహౌత్సవం కనుల విందుగా సాగింది. గురువారం శ్రీధర్మ శాస్త అయ్యప్ప దేవాలయంలో కమిటీ చైర్మన్ శింగిరికొండ మాధవశంకర్ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు వెంకటేష్ శర్మ నేతృత్వంలో ఉదయం సాంప్రదయ అర్చనలతో పూజ కార్యక్రమం నిర్వహించారు. అయ్యప్ప ప్రతిమను రథంలో అమర్చగా అక్కడి నుంచి మేళాల నడుమ అయ్యప్ప స్వాముల నృత్య ప్రదర్శనలో ప్రధాన రహదారి నుంచి మాధన్నపేట చెరువు వద్దకు చేరుకున్నారు. అక్కడ అయ్యప్ప జల క్రీడలు, మంగళహారతుల ఈ దృశ్యాలను విశేష భక్త జనం వీక్షిస్తూ అయ్యప్ప శరణు ఘోత్సవాలు మారు మోగించారు. ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి ఈ ఉత్సవాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరు కాగా, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, స్వప్న దంపతులు, తదితర ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, ప్రముఖ వ్యాపారులు, ఆలయ కమిటీ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.