Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగెం
మండలానికి నూతనంగా వచ్చిన తహశీల్దార్ రాజేంద్రనాధ్ను గురువారం టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు పెండ్లి పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువా కప్పి సన్మానం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు పోడేటి ప్రశాంత్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు చిర్ర రాజు, కోశాధికారి బాణోత్ మోహన్ నాయక్, యూత్ కమిటీ ఉపాధ్యక్షులు కక్కేర్ల శరత్, చింతిరెడ్డి భరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.