Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాశిబుగ్గ
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ బిపిన్ రావత్ దేశానికి చేసిన సేవలు మరువలేనివని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్ రెడ్డి అన్నారు ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం చాంబర్ ఆధ్వర్యంలో రావత్, అతని భార్య మధులికలతోపాటు 11మంది సైనిక అధికారుల జ్ఞాపకార్థం సంతాప సభ నిర్వహించారు. ముందుగా రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. రావత్ త్రివిధ సైనిక దళాధిపతిగా అత్యంత సమర్థతతో సమన్వయంతో చేసిన సేవలు, రక్షణ దళాల పటిష్టత కోసం చేసిన ప్రయత్నాలు ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రమౌళి, వేద ప్రకాష్, శ్రీనివాస్, సంపత్, హరినాథ్, రాజేశ్వర్ రావు పాల్గొన్నారు.
నవతెలంగాణ-సుబేదారి
దేశ త్రివిధ దళాదిపతి బిపిన్ రావత్ మృతికి గురువారం ఆర్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రిన్సిపల్ బన్న అయిలయ్య ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, మౌనం పాటించి సంతాపం తెలిపారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ స్వామి, డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ ఫణి, డాక్టర్ కనకయ్య, డాక్టర్ సురేష్ పాల్గొన్నారు.
నవతెలంగాణ-దామెర
త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్‌కు గురువారం శ్లోక ఉన్నత పాఠశాలలో ప్రిన్సిపాల్ కొండా రాధికా కష్ణమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రసాద్. ప్రశాంత్ రెడ్డి, వెంకటేష్, రవికుమార్, నవ్య, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-కాజీపేట..
త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మృతి దేశానికి తీరని లోటని ప్రభుత్వ చీఫ్ విప్, పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయాభాÛస్కర్ అన్నారు. 47వ డివిజన్ కార్పొరేటర్ నర్సింగ్ రావు ఆధ్వర్యంలో కాజిపేట చౌరస్తాలో గురువారం నిర్వహించిన సంతాప కార్యక్రమంలో ఆయన బీపిన్ రావత్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. నాయకులు నార్లగిరి రమేష్, కాటపురం రాజు, రవి, సోనీ, సర్వర్, దువ్వ కనకరాజు, శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
స్థానిక జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం త్రివిధ దళాధిపతి బిపిన్‌రావత్‌కు ఘన నివాళలర్పించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ కో-ఆర్డినేటర్ నమిండ్ల శ్రీనివాస్, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బిన్నీ లక్ష్మణ్, వెంకట్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రూపిరెడ్డి సాయి రెడ్డి, కార్యదర్శి మౌటం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-పరకాల
ఆర్మీ హెలికాప్టర్ ప్రమాద మృతులకు నివాళిగా గురువారం రాత్రి కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్‌తోపాటు మరో 11మంది మృతిచెందగా వారి ఆత్మకు శాంతి కలగాలని అంబేద్కర్ సెంటర్ నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.