Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
పేదల కోసమే ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందిస్తోందని టీఆర్ఎస్ మండల నాయకులు అన్నారు. మండల కేంద్రానికి చెందిన కీర్తి సురేఖకు రూ.20 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును గోవిందరావుపేట ఎంపీపీ సూడి శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీటీసీ తుమ్మల హరిబాబు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సూరపనేని సాయి కుమార్ చేతుల మీదుగా గురువారం అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. రాష్ట్రంలో పేదలెంరికి కష్టం వచ్చినా సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి లకావత్ నర్సింహనాయక్, ఎంపీటీసీలు ఆలూరి శ్రీనివాసరావు, లావుడ్య రాంచందర్, మండల కోఆప్షన్ సభ్యుడు బాబర్, మండల ఉపాధ్యక్షులు చుక్క గట్టయ్య, చంద్ర రాజు, నాయకులు కీర్తి రవి తదితరులు పాల్గొన్నారు.