Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-టేకుమట్ల
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వస్తున్న మార్పులతో మిర్చి పంటలో వెస్ట్రన్ తామర పురుగులతో రైతులు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని జిల్లా ఉధ్యాన అధికారి ఎడ్ల సునీల్‌కుమార్ తెలిపారు. మండలంలోని పంగిడిపల్లి, పెద్దంపల్లి గ్రామాల్లోని మిర్చి పంటలను ఆయన గురు వారం పరిశీలించి తెగుళ్లపై రైతులకు సూచనలు అందిం చారు. వెస్ట్రన్ తామర పురుగుల నివారణ కోసం ఎకరాకు 20 నుంచి 30 వరకు నీలిరంగు జిగురు వట్టలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే ఎకరాకు లీటర్ వేప నూనె పిచికారీ చేయాలన్నారు. ఎకరానికి 400 ఎంఎల్ ఫిప్రోనిల్, 60 ఎంఎల్ స్పైనోసాడ్ పిచికారీ చేయాలన్నారు. బయో, సింథటిక్ పైరిత్రాయిడ్ మందులను పిచికారి చేయకూడదని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, ఏఓ శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.