Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరంగల్ రూరల్ జెడ్పీ చైర్‌ఫర్సన్ గండ్ర జ్యోతి
నవతెలంగాణ-భూపాలపల్లి
వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు హైదరాబాద్‌లోని శంషాబాద్ శ్రీరామ్‌నగర్‌లో జరగనున్న శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వరంగల్ రూరల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి కోరారు. ఆహ్వాన పత్రిక అందుకున్న తర్వాత జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర రాజధానిలో 1035 కుండ శ్రీ లక్ష్మీ నారాయణ మహా క్రతువు, 108 దివ్య దేశ ప్రతిష్ట, కుంభాభిషేకము, స్వర్ణమయ శ్రీ రామానుజ ప్రతిష్ట, స్ఫూర్తి ప్రదాత సమతా మూర్తి లోకార్పరణ, కార్యక్రమం జరగడం సంతోషకరమన్నారు. కులాలు, మతాలు, జాతులు, వర్గాలు, ఆస్తులు, అంతస్తులు, పార్టీల పేరుతో మనుషుల మధ్య గోడలు ఏర్పాటు చేస్తున్నాయని మాటలకే పరిమితం అయిపోయిందని తెలిపారు. నాటి రామానుజుల అవసరం ఈనాటి సమాజానికి మళ్లీ ఏర్పడిందన్నారు. వారి శ్రీ మూర్తి శ్రీ సూక్తి ఈ మానవ జాతికి స్ఫూర్తి అన్నారు. వారి పండగ అంటే ఈ స్ఫూర్తి పొందే ఉత్తమమైన సమయం దొరకదన్నారు. ఆకాశమే హద్దయిన ఆచార్యుల దివ్య రూపాన్ని 216 అడుగుల పంచలోహ మూర్తిగా దర్శించవచ్చని తెలిపారు. ఆచార్య చంద్రునికో నూలు పోగులా వారిని సువర్ణమూర్తిగా నిత్యం ఆరాధించొచ్చని సూచించారు. ప్రతి సాయంకాలం కమలంలో ఉంచి ఆవిర్భవించి కపను నలుదిశలా కురిపిస్తుంది శ్రీరామానుజుల వారిని నిత్యం చేసే ప్రేమ జలాలతో అభిషేకం చేయవచ్చన్నారు. ఆధునిక సాంకేతిక విజ్ఞానం సహాయంతో శ్రీరామానుజుల చరిత్ర నుంచి కొన్ని స్ఫూర్తిదాయక సన్నివేశాలను ఆయా సమయాలలో సందర్శించవచ్చునని తెలిపారు. శ్రీ లక్ష్మీ నారాయణ మహా క్రతువు 1035 హౌమ కుండాలతో జరుగుతుందన్నారు. దీన్ని సుమారు ఐదు వేల మంది రుత్వికులు నడిపిస్తారని వివరించారు. వారిలో నాలుగు వేదాలకు చెందిన ఏడు శాఖల పారాయణ హవనము 10 కోట్ల అష్టాక్షరి, కోటి సార్లు వివిధ పురాణ ఇతిహాస ఆగమ గ్రంథము పారాయణము జరుగుతుందని తెలిపారు. అలాగే ఆయా దేశాల నుంచి తెచ్చిన శ్రీ సాలగ్రామమూర్తి దివ్య సన్నిధిలో చేర్చి 108 దివ్య దేశాలు ప్రాణప్రతిష్ఠ జరుగుతుందన్నారు. ప్రతిరోజు కనీసం లక్ష మందికి పైగా ఈ తదియ రాధన గోష్టిలో ప్రసాదం స్వీకరణ చేయడం జరుగుతుందన్నారు. ఇది ఒక అద్భుతమైన అపూర్వమైన సన్నివేశం అని ఇందులో పాల్గొనడం ఎంతో అదష్టం అని సేవలందించడం మరింత అదృష్టం అన్నారు ధన దీన రూపంగా ప్రోత్సహిస్తూ పాల్గొనడం సకల పుణ్యప్రదమని ఆమె అన్నారు కావున జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వికాస తరంగిణి కార్యకర్తలు తనూజ, విమల, దయాకర్‌రెడ్డి, నాగార్జున, భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ వెంకటరాణి, జెడ్పీ వైస్ చైర్మెన్ కళ్లెపు శోభ రఘుపతిరావు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్ధన్, రూరల్ అధ్యక్షుడు పిన్‌రెడ్డి రాజిరెడ్డి, కౌన్సిలర్లు పిల్లలమర్రి శారద నారాయణ, ఎడ్ల మౌనిక, రవీందర్ గౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బుర్ర రమేష్ గౌడ్, సిద్దు, రమేష్, పీఏసీఎస్ చైర్మెన్ మేకల సంపత్ కుమార్ యాదవ్, నాయకులు కరీమ్, రవీందర్, వేణు, సురేష్, తదితరులు పాల్గొన్నారు.