Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
ఇటీవల మృతి చెందిన టీఆర్ఎస్ మండల పార్టీ బీసీ సెల్ కార్యదర్శి మద్దిరాల నర్సింహమూర్తి తల్లి దశదినకర్మకు మండల టీఆర్ఎస్ నాయకులు హాజరై ఆయనను పరామర్శించి ఆర్థికసాయం అందించారు. కార్యక్రమంలో ఏటూరునాగారం డివిజన్ ఆత్మ డైరెక్టర్ అమిలి చంద్రం, మండల పార్టీ ఉపాధ్యక్షుడు గాదె శ్రీనివాసచారి, మండల బీసీ సెల్ అధ్యక్షుడు శానం నరేందర్, ఎస్టి సెల్ మండల ప్రధాన కార్యదర్శి కెక్కెం జగదీష్, బీసీ సెల్ కార్యదర్శి చిన్నపెళ్లి వెంకన్న, ఎస్టీసెల్ సహాయ కార్యదర్శి పాల్తియా వెంకటరావు, ములుగు మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కోరం సంతోష్, జిగట నగేష్, పాయం రమేష్, చిన్నపెళ్లి నర్సింహారావు, గొగ్గలి జితేందర్, ముప్పారపు సందీప్ పాల్గొన్నారు.