Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
పారితోషికాల జీఓను రద్దు చేసి వెంటనే పీఆర్సీ ప్రకటించి ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతన మివ్వాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆశావర్కర్లు జిల్లా కేంద్ర శివారులోని జంగాలపల్లి నుంచి కలెక్టరేట్ వరకు 5 కిలోమీటర్ల మేరకు శుక్రవారం మహాపాదయాత్ర నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ అధికారి రాజ్ప్రకాష్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా జయలక్ష్మీ మాట్లాడారు. ప్రభుత్వం ఆశావర్కర్లకు వేతనాలు పెంచుతున్నట్టు ప్రకటిస్తూ ఆచరణలో పారితోషికాలే ఇస్తుండడం దుర్మార్గమన్నారు. కరోనా కాలంలో రెండేండ్లపాటు ఎనలేని సేవలు అందించగా ఆశావర్కర్లకు కేంద్ర ప్రభుత్వం నెలకు వెయ్యి రూపాయలు చొప్పున అందించిన నెలసరి ప్రోత్సాహకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆశావర్కర్లకు అందించకపోవడం సిగ్గుచేటన్నారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న 16 నెలల రిస్క్ అలవెన్స్‌ను వెంటనే విడుదల చేయాలని, కేంద్ర ప్రభుత్వం రిస్క్ అలవెన్స్‌ను రూ.10 వేలకు పెంచాలని, జాబ్ చార్ట్ రూపొందించాలని, ఈఎస్ఐతోపాటు పీఎఫ్ వర్తింపజేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అవసరమైన సామగ్రి ఇవ్వకుండానే అధికారులు సర్వేలకు పంపతున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్, నాయకులు గుండెబోయిన రవిగౌడ్, మడే రవి, నీలాదేవి, శ్రావ్య, ప్రభావతి, నాగమణి, పాపా, సంధ్య, సుజాత, కవిత, మాధవి, శాంతకుమారి, పూర్ణ, నళిని, చంద్రవని, రజిత, సుధ, భాగ్య, సరిత, శోభ, మమత, కోమల, తదితరులు పాల్గొన్నారు.
కోల్‌బెల్ట్ : తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జోత్స్నకు వినతిపత్రం అందించారు. అనంతరం సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంపేటి రాజయ్య, ఆశావర్కర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మెట్టుకొండ లక్ష్మి మాట్లాడారు. కార్యక్రమంలో యూనియన్ మండల అధ్యక్షురాలు పునుగపాటి కుమారి, నాయకులు జయ, స్వరూప, పద్మ, రమాదేవి, సౌజన్య, శ్యామల, రాజ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.