Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మరిపెడ
పెయింటింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా నాయకుడు దుండి వీరన్న, మాజీ సర్పంచ్ పానుగోతు రాం లాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని కనకదుర్గ ఫంక్షన్ హాలులో శుక్రవారం నిర్వహించిన అంబేద్కర్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ సమావేశానికి అధ్యక్షుడు సదాకర్ అధ్యక్షత వహించగా ప్రత్యేక ఆహ్వానితు లుగా రాంలాల్, వీరన్న హాజరై మాట్లాడారు. సంఘటితంగా ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు. కార్మికులందరూ సంఘంలో సభ్యులుగా చేరి హక్కులను సాధించుకోవాలని సూచించారు. సమావేశంలో సీఐటీయూ మండల కన్వీనర్ నందిపాటి వెంకన్న, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కొండ ఉప్పలయ్య, కాయిత రాంబాబు, అంబేద్కర్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు కర్ర మురళి, అధ్యక్షుడు ఇస్లావత్ సుధాకర్, ఉపాధ్యక్షుడు దాసరి వెంకన్న, కార్యదర్శి ఎడెల్లి లాలు, కోశాధికారి జినక ఎల్లయ్య, ఏషియన్ పెయింట్ డీలర్ బొల్లం నవీన్, అశోక్, సంఘం సభ్యులు ధారా నర్సింహ, తదితరులు పాల్గొన్నారు.