Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాశిబుగ్గ
వరంగల్‌లో స్పైస్ బోర్డు ఏర్పాటు చేయడంతో రైతులకు, వ్యాపారులు లాభపడు తారని చాంబర్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం చాంబర్ కార్యాలయ ంలో స్పైస్ బోర్డ్ ఆఫ్ ఇండియాచే చిల్లీస్ టర్మరిక్ ట్రేడర్స్‌కు ఏర్పాటు చేసిన ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఆయన మాట్లాడారు. వరంగల్ వ్యవసాయ మార్కెట్లో రైతు పండించిన అన్ని రకాల పంట ఉత్పత్తులు పెద్ద ఎత్తున మార్కెట్ చేయబడ తాయన్నారు. వాటి ఎగుమతి కోసం నాణ్యత ధ్రువీకరణ తప్పనిసరి కావడంతో శాంపిల్స్‌ను ఇతర రాష్ట్రాలకు పంపి ఫలితాల కోసం రోజుల తరబడి ఎదురు చూస్తున్నామన్నారు. దీంతో సరుకు ధరలో హెచ్చుతగ్గులు ఏర్పడి ఇటు రైతులు, అటు వ్యాపారులకు నష్టం జరుగు తుందన్నారు. స్పైస్ బోర్డు అధికారులు దష్టి సాధించి వరంగల్ నగరంలో స్పైస్ బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం చిల్లీస్ పాస్‌పోర్ట్ కమిటీ మెంబర్ సాంబశివ రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటికే స్పైస్ బోర్డు ఏర్పాటు చేయాలని వినతిపత్రాలను ఢిల్లీకి పంపించామన్నారు. త్వరలోనే స్పైస్ బోర్డు ఏర్పాటవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్పైస్ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ లింగప్ప మాట్లాడుతూ.. నాణ్యత టెస్ట్ రిజల్ట్ పొందే క్రమంలో ఆలస్యం జరిగినట్లయితే వ్యాపారులు తనకు సమాచారం అందిస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరగా రిజల్ట్ వచ్చే విధంగా కషి చేస్తానన్నారు. వరంగల్ జిల్లా హార్టికల్చర్ అధికారి శంకర్, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు చంద్రమౌళి, వేద ప్రకాష్, సంపత్, శ్రీనివ్షాస్, సంపత్, చక్రధర్, యాదగిరిి , రాజేష్ తదితరులు పాల్గొన్నారు.