Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
బాలల హక్కులు పరిరక్షిస్తేనే మానవ హక్కులు కాపాడపడి భావితరానికి నాంది పలుకుతుందని స్వయంకృషి సోషల్ వర్క్ ఆర్గనైజషన్ సెక్రటరీ బెజ్జంకి ప్రభాకర్ అన్నారు. శుక్రవారం విజ్డమ్ ఉన్నత పాఠశాలలో స్వయంకృషి సోషల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఎఫ్ఎంఎం సహకారంతో 'అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం' సందర్భంగా బాలల హక్కులు-బాధ్యతలు, హక్కుల పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బాలల హక్కులు కాపాడినప్పుడే మానవ హక్కులు కాపాడిన వారమౌతామన్నారు. మానవులకు స్వేచ్ఛ, సమానత్వం, వాక్స్వాతంత్య్రం అవసరమన్నారు. హక్కులను కుల, మత, ప్రాంతీయ బేధం లేకుండా ప్రతి పౌరుడు జీవించినప్పుడే హక్కులు సంపూర్ణ సార్థకత ఉంటుందని అభిప్రాయడ్డారు. పాఠశాల డైరెక్టర్ ఎస్డీ.జావేద్ విద్యా హక్కు చట్టం పట్ల అవగాహన కల్పించారు. స్వచ్చంధ సంస్థల ప్రతినిధి వెంకటస్వామి, వైఎస్ ప్రిన్సిపాల్ ప్రకాష్, వీర భద్రయ్య పాల్గొన్నారు.