Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మునిసిపల్ చైర్ పర్సన్ అంగోతు అరుణ
నవతెలంగాణ - వర్ధన్నపేట
విద్యార్థులలో నైపుణ్యాలను గుర్తించేందుకు పోటీ పరీక్షలు నిర్వహించాలని వర్ధన్నపేట మునిసిపల్ చైర్ పర్సన్ అంగోతు అరుణ అన్నారు. శుక్రవారం పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛ సర్వేక్షన్-2022 సిటిజన్ ఎంగేజ్మెంట్లో భాగం గా తడి, పొడి హానికారక చెత్త, ప్లాస్టిక్ నిషేధం అంశాల పై వ్యాస రచన, చిత్ర లేఖనం పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యార్థులు ఏకాగ్రతతో చదువులపై దష్టి సారించాలన్నారు. విద్యార్థి దశ ప్రాముఖ్యమైనదని, ఈ వయసులో చదువులపై దష్టి సారిస్తే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం పలు సౌకర్యాలు కల్పించి ఉచిత నాణ్యమైన విద్యను అందిస్తోన్నట్టు పేర్కొన్నారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని చదువులపై దష్టి సారించాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు చదువుతో పాటుగా పరిసరాలు సమాజంపై సైతం అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మునిసిపల్ వైస్ ఛైర్మెన్ ఎలేందర్ రెడ్డి, మున్సిపల్ కమీషనర్ గొడిశాల రవీందర్, సానిటరీ ఇన్స్పెక్టర్ ప్రశాంతి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహ మూర్తి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.