Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ జనగామ
జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పీజీ కళాశాలలో సైన్స్ కోర్సులు ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ధర్మభిక్షం డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ రిజిస్టర్కి ఆయన వినతిపత్రం అందజేసి మాట్లాడారు. జనగామ చుట్టూ పక్కల ప్రాంతంలో గ్రామీణ విద్యార్థులు అనేక మంది చదువుతున్నారని, వారికి స్థానికంగా సైన్స్ కోర్సు అందుబాటులో లేకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం వస్తుందన్నారు. అదే విధంగా కోవిడ్ రీత్యా దూరంగా చదువుతున్న విద్యార్థులకు ద్వితీయ సంవత్సరం బదిలీ చేసుకునే వెసులుబాటు ఇవ్వాలని కోరారు. అదే విధంగా పీజీ కళాశాల కోసం కేటాయించిన స్థానంలో భవనం నిర్మించాలన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మౌళిక వసతులు కల్పించాలన్నారు.