Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- హన్మకొండ
పద్మాక్షి కాలనీలోని సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీపీఐ(ఎం) నాయకులు వేల్పుల సారంగపాణి, మంద సంపత్ డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండ సౌత్ సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో 30వ డివిజన్లోని పద్మాక్షి కాలనీలో సమస్యలపై సర్వే నిర్వహించి స్థానికులతో సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అపార్ట్మెంట్ వెనక వీధిలో సీసీ రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణాలు చేపట్టాలని, ఎస్ఆర్ కాలేజీ నుంచి మెయిన్‌రోడ్ వరకూ అండర్ డ్రెయినేజీ నిర్మించాలని డిమాండ్ చేశారు. కట్టమీద మెట్ల దారి వైపు సమాధుల దగ్గర కరెంటు తీగలు వేలాడుతున్నాయని, ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. కాలనీవాసులు సమస్యలు పరిష్కరించాలని అధికారులకు అనేకసార్లు కోరినప్పటికీ వారు పట్టించుకోలేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పద్మాక్షి కాలనీలోని సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.