Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పోచమ్మ మైదాన్
వరంగల్ మహానగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలని మేయర్ గుండు సుధారాణి అన్నారు. అందుకోసం ప్లాస్టిక్ విక్రేతల సహకారం అందించాలన్నారు. శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయం సమావేశ మందిరంలో స్వచ్ఛ సర్వేక్షన్-2022 అవగాహన కార్యక్రమంలో భాగం గా ప్లాస్టిక్ విక్రయదారులతో కమీషనర్ ప్రావీణ్యతో కలసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వెస్ట్ మేనేజ్మెంట్ రూల్స్-2016 ప్రకారం 75 మైక్రాన్ కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ ఉత్పత్తులను నిషేధించినట్టు తెలిపారు. ప్లాస్టిక్ విక్రేతలు పర్యావరణ పరిరక్షణకు సహకరించాలన్నారు. అనంతరం బల్దియా కమీషనర్ మాట్లాడుతూ.. నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తులను విక్రయిస్తే బల్దియా-పోలీస్ సిబ్బందితో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్లాస్టిక్ విక్రేతలు ప్రత్యామ్నాయ మెప్మా వారి ఉత్పత్తులైన జూట్, కాగితపు సంచులు వినియోగించేలా ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి అదనపు కమీషనర్ విజయలక్ష్మి, ముఖ్య ఆరోగ్యాధికారి డా.రాజా రెడ్డి, సానిటరీ సూపర్వైజర్లు సాంబయ్య, నరేందర్, భాస్కర్, సానిటరీ ఇన్స్పెక్టర్లు, హౌల్సెల్ దుకాణదాదారులు పాల్గొన్నారు.