Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరంగల్ పోలీస్ కమిషనర్ డా|| తరుణ్ జోషి
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
భూచట్టాలపై పోలీసు అధికారులు అవగాహన కలిగి వుండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సూచించారు. 'భూ తగాదాల్లో పోలీస్ పాత్ర' అనే అంశంపై పోలీస్ అధికారులకు శుక్రవారం నిట్ కళాశాల సమావేశ ప్రాంగణంలో ఒక రోజు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోజు రోజుకి పోలీస్ స్టేషన్ల లో నమోదవుతున్న భూతగాదా కేసులను పరిష్కరించడంలో పోలీస్ అధికారులకు భూ చట్టాలపై మరింత అవగాహన కల్పించడంలో భాగంగా ఈ శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు.
ఈ శిక్షణ తరగతుల్లో భాగంగా రాష్ట్రంలోని భూ చట్టాలు, భూతగాదాలను పరిష్కరించేందుకు పరిశీలించాల్సిన పత్రాలు, భూమి హక్కదారున్ని గుర్తించాల్సిన తీరు, ముఖ్యంగా వివిధ రకాల భూతగాదాల్లో భాధితులకు న్యాయం చేయడం కోసం అధికారులు పరిగణలోనికి తీసుకోవాల్సిన పత్రాలు, అనుసరించాల్సిన చట్టాలు, భూతగాదాలకు సంబంధించి ఉన్నత న్యాయ స్థానాలైన సుప్రీంకోర్టు, హైకోర్టు నుండి వెలుబడిన తీర్పులపై ప్రముఖ న్యాయవాది ఎం సునీల్ కుమార్ పోలీస్ అధికారులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. ప్రస్తుత రోజుల్లో భూమి విలువలు రెట్టింపు కావడంతో భూ తగాదాలు సంఖ్య ఘననీయంగా పెరిగాయన్నారు. భూ తగాదాలకు సంబందించి పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుల సంఖ్య పెరిగిందన్నారు. ఈ విధంగా వచ్చే భూతగాదాల పరిష్కారం కోసం పోలీస్ అధికారులు నిర్వహించాల్సిన దర్యాప్తు తీరుతెన్నులను వివరించారు. భూ తగాదాల్లో సివిల్ తగాదాలుగా పరణించాలా, క్రిమినల్ కేసులుగా పరిగణించాలనే పోలీసు అధికారులు సంసిద్ధతలో ఉంటారన్నారు. ఇలాంటి సమయంలో భూ చట్టాలపై అధికారులకు అవగాహ కలిగివుండాలని పోలీస్ కమిషనర్ తెలియజేసారు. అంతకు ముందు రెండురోజుల క్రితం హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన త్రిదళపతి బిపిన్ రావత్ కు శ్రధ్దాంజలి ఘటిస్తూ పోలీస్ అధికారులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు శ్రీనివాస్ రెడ్డి, వెంకటలక్ష్మి, పుష్పా రెడ్డి, పరిపాలన అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్, లా అండ్ ఆర్థర్, ట్రాఫిక్ అదనపు డీసీపీ సాయి చైతన్యతో పాటు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.