Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టూరిజం ప్యాకేజీ లో పాలకుర్తి, బమ్మెర, వల్మిడిలకు మహర్దశ
పర్యాటక పనులపై అధికారులతో మంత్రి సమీక్ష
నవతెలంగాణ-పాలకుర్తి
టూరిజం ప్యాకేజీలో పాలకుర్తి, బొమ్మెర, వల్మిడిలను పర్యాటక కేంద్రంగా అభివద్ధి చేసేందుకు మహార్దశ వచ్చిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవారం మండలంలోని పాలకుర్తి, బొమ్మెర, వల్మిడి గ్రామాల్లో జరుగుతున్న టూరిజం ప్యాకేజీలోని పర్యాటక పనులను జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్యతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పర్యాటక పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శివలింగయ్యతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు.
చారిత్రాత్మకమైన పాలకుర్తి ప్రాంతాన్ని టూరిజం ప్యాకేజీలో పర్యాటక కేంద్రంగా అభివద్ధి చేయాలని సీఎం కేసీఆర్ ప్రత్యేక దష్టి పెట్టారని తెలిపారు. పాలకుర్తి, బొమ్మెర, వల్మిడిలకు ప్రత్యేక చారిత్రాత్మక నేపథ్యం ఉందని వివరించారు. పాలకుర్తిలో సోమనాథుడు, బమ్మెరలో పోతన, వల్మిడిలో వాల్మీకి మహర్షి తో పాటు శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం ఉందని పేర్కొన్నారు. ఈ మూడు ప్రాంతాలను టూరిజం ప్యాకేజీ లో పర్యాటక కేంద్రంగా అభివద్ధి చేసి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచేందుకు సీఎం కేసీఆర్ టూరిజం ప్యాకేజీ లో రూ 22 కోట్ల 50 లక్షలు నిధులు మంజూరు చేశారన్నారు. పర్యాటక పనుల్లో పురోగతి సాధించేందుకు అధికారులు కషి చేయాలని ఆదేశించారు.
పనులను సకాలంలో పూర్తి చేసే విధంగా ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించాలన్నారు. టూరిజం ప్యాకేజీ లో చేపట్టిన పర్యాటక పనులపై పూర్తిస్థాయి నివేదికను సీఎం కేసీఆర్ కు సమర్పించాలని ఆదేశించారు. టూరిజం ప్యాకేజీలో చేపట్టే పర్యాటక పనులతో ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు వస్తుందని తెలిపారు. అనంతరం పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, స్టేషన్ ఘన్పూర్ ఆర్డీఓ కష్ణవేణి, డీపీఓ రంగాచారి, ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కు రాంబాబు, జెడ్పీ ఫ్లోర్ లీడర్ పూస్కూరి శ్రీనివాసరావు, జిల్లా కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ మదర్, తహసీల్దార్ విజయభాస్కర్, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ వీరమనేని యాకాంతారావు, ఎంపీడీఓ వనపర్తి అశోక్ కుమార్, పాలకుర్తి, తొర్రూరు సొసైటీ చైర్మన్లు బొబ్బల అశోక్ రెడ్డి, గోనె మైసి రెడ్డి, తోపాటు సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు.