Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రెండు పంటలకు సాగు నీరు తధ్యం: ఎమ్మెల్యే పెద్ది
నవతెలంగాణ-నర్సంపేట
రామప్ప-పాకాల, రంగయ చెరువు ఎత్తిపోతల పథకాలను త్వరలోనే ప్రారంభించబోతున్నామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం రామప్ప పంప్‌హౌజ్‌ను ఎమ్మెల్యే సందర్శించారు. పంప్ తుది దశలో ఉన్న పనులను, పైలాన్ నిర్మాణాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాకాల, రంగయ చెరువు రెండు ప్రాజెక్టులతో నియోజకవర్గంలో ఖానాపురం, నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి, చెన్నారావుపేట మండలాల పరిధిలోని అత్యధిక ఆయకట్టుకు రెండు పంటలకు సాగు నీరు అందబోతుండడం రైతుల అదృష్టమన్నారు. ప్రాజెక్టు పనులు తుది దశకు చేరుకొని ఇటివల రెండు పంప్‌లను ట్రయల్ రన్ కూడా చేశామని గుర్తు చేశారు. మిగిలిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మెగా కన్సస్ట్రక్షన్ కంపెనీ, ఇరిగేషన్ ఇంజనీరు అధికారులకు సూచించారు. త్వరలో ప్రాజెక్టులను ప్రారంభించబోతున్నామని ఇందుకోసం ప్రాజెక్టు చారిత్రకతను తెలియజెప్పేందుకు పైలాన్ ఆవిష్కరణ చేయబోతున్నట్లు తెలిపారు. ప్రతి యేటా రెండు పంటలకు సాగు నీరు అందడం తధ్యమని, నియోజకవర్గం నిత్య ధాన్యగారంగా నిల్వవనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.