Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) మండల కార్యదర్శి గుమ్మడిరాజుల రాములు
నవ తెలంగాణ-హసన్ పర్తి
మండలంలోని సిద్దాపూర్, అర్వపల్లి గ్రామాల మధ్యలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులకు పంపిణీ చేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి గుమ్మడిరాజుల రాములు డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో శుక్రవారం డబుల్ బెడ్ రూం ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2017లో పూర్తి చేసిన ఇండ్లను నేటి వరకూ పేదలకు పంపిణీ చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అర్హులైన ప్రతి వారికి ఇల్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆశ చూపి మోసం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రం మొత్తం పూర్తయిన ఇళ్లను పంపిణీ చేస్తున్నా ప్రభుత్వం ఇక్కడ మాత్రం పంపిణీ చేయకుండా కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. నిరుపేదలైన వారు ఇల్లు లేక ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం మాత్రం వారికి పూర్తయిన ఇళ్లను అందించడంలో విఫలమైందని ఆరోపించారు. 2023ఎన్నికల ముందు మాట ఇచ్చి మరోసారి పేదలను మోసం చేసి అధికారంలోకి రావడం కోసమే కాలయాపన చేస్తోందన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే పార్టీ ఆధ్వర్యంలో అర్హులైన వారికి ఇంటి తాళాలు తీసి అందిస్తామని హెచ్చరించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మంద సుచందర్, దేవరకొండ రమేష్, జూకంటి పద్మ, గోల్కొండ కుమార్, సదానందం తదితరులు పాల్గొన్నారు.