Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూర్ టౌన్
మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య అన్నారు. ప్రభుత్వం అందించిన రొయ్య పిల్లలను జిల్లా మత్స్యశాఖ అధికారి బుచ్చిబాబు, ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు చిల్లా సహదేవ్, మండల అధ్యక్షుడు కొత్తూరు రమేష్, సర్పంచ్ మోత్కూరి రవీంద్రచారి, ఎంపీటీసీ మేరుగు మాధవి రమేష్‌లతో కలిసి మండలంలోని గుర్తూరు గ్రామంలోని పెద్ద చెరువులోకి శుక్రవారం వదిలారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని చెప్పారు. గతంలో లేని విధంగా ప్రభుత్వం నూరు శాతం సబ్సిడీపై మత్య్సకారులకు చేప పిల్లలను సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. చేపల ఎగుమతి, రవాణా కోసం మత్స్యకారులకు రాయితీతో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు సైతం అందిస్తున్నట్టు వివరించారు. మత్స్యకార్మికులు ప్రమాదవశాత్తు మృతి చెందితే రూ.6 లక్షల బీమా అమలు చేస్తామని సీఎం హామీ ఇచ్చిన క్రమంలో అందుకు అనుగుణంగా ప్రభుత్వం విధివిధానాలు ప్రభుత్వం రూపొందిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి గంధం చంద్రమూర్తి, సాదు రాములు, సొసైటీ అధ్యక్షుడు సింగారం శ్రీనివాస్, మాజీ సర్పంచ్ సింగారం కుమారస్వామి, సొసైటీ ప్రధాన కార్యదర్శి కొత్తూరు ఐలయ్య, బోయిని రాజు, రచ్చ కుమార్, మురళీ, శీను, యాకయ్య, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ యాకయ్య, ప్రతినిధులు విష్ణు, రాజు, సురేష్, వేణు, తదితరులు పాల్గొన్నారు.