Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెల్లికుదురు
విద్యార్థినులపై దాడులను అరికట్టాలని ఎస్ఎఫ్ఐ బాలికల విభాగం కన్వీ నర్ పట్ల పూజ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మండల కేంద్రం లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థినులకు సభ్యత్వం అందిం చారు. ఈ సందర్భంగా పట్ల పూజ మాట్లాడారు. దేశంలో గోవులకు ఉన్న రక్షణ అమ్మాయిలకు లేదని ఆందోళన వెలిబుచ్చారు. రాష్ట్రంలో విద్యార్థినులపై అఘాయిత్యాలు నానాటికీ పెరుగుతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. కేజీబీవీల్లో విద్యార్థులకు మెనూ మరింత మెరుగు పర్చాలని, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పట్ల మధు, నాయకులు యాకూబ్, మహేష్, ప్రణీత్, ప్రమోద్ పాల్గొన్నారు.