Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీపీసీసీ కార్యదర్శి పైడాకుల అశోక్‌కుమార్
నవతెలంగాణ-గోవిందరావుపేట
కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదును విజయ వంతం చేయాలని టీపీసీసీ కార్యదర్శి పైడాకుల అశోక్ కుమార్ కోరారు. మండల కేంద్రంలో పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సీతారాంనాయక్ ఆధ్వర్యంలో ఆపరే టర్లతో డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోత్ రవిచందర్‌తో కలిసి అశోక్‌కుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అశోక్‌కుమార్, రవిచందర్ మాట్లాడారు. మండలంలోని 35 బూత్‌ల్లో సభ్యులకు డిజిటల్ సభ్యత్వాన్ని పూర్తి చేశా మన్నారు. బూత్ ఎనరోలర్గా ఎన్నికైన సభ్యులతో పార్టీ సభ్యత్వాన్ని ప్రారంభించామని చెప్పారు. ఎన్రోలర్లు మండ లంలోని ప్రాంత క్లస్టర్ ఆదేశాల మేరకు పని చేస్తూ సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ప్రతి బూత్లోనూ 100కు తగ్గకుండా సభ్యత్వాలు నమోదు చేయాలని కోరారు. ఎన్రోలర్లు క్రమశిక్షణతో సభ్యత్వ నమోదును దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దాసరి సుధాకర్, కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పెండెం శ్రీకాంత్, జిల్లా నాయకులు నాగేందర్రావు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింత క్రాంతి, ఎల్లావుల అశోక్, చందు, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు సూడి సత్తిరెడ్డి, బీసీ సెల్ మండల అధ్యక్షుడు రవి, ఎంపీటీసీ గోపిదాసు ఏడుకొండలు, సర్పంచ్‌లు లావుడ్య లక్ష్మీ జోగానాయక్, ముద్దబోయిన రాము, భూక్య సుక్య, ఉపసర్పంచ్లు కట్ల జనార్ధన్‌రెడ్డి, బేతి దేవేందర్‌రెడ్డి, కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, పాలడుగు వెంకట కృష్ణ, సూదిరెడ్డి జనార్ధన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.