Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
మండలంలోని ఇప్పలపల్లి మానేరు నుంచి అక్రమార్కులు ఇసుక అక్రమ రవాణా కోసం ఏర్పాటు చేసుకున్న అక్రమ రహదారిని తహసీల్దార్ మొగిలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జేసీబీ సాయంతో శుక్రవారం తొలిగించారు. అక్రమ ఇసుక రవాణా కోసం మానేరులో కొందరు వ్యాపారస్తులు, ఇసుక రవాణాదారులు సిండికేట్గా ఏర్పడి మానేరులో సిమెంట్ పైపులతో తాత్కాలిక కల్వర్టు నిర్మించి 20 రోజులుగా మండలంలో యథేచ్ఛగా అక్రమ ఇసుక దందాను కొనసాగిస్తున్న అక్రమ రహదారిని తొలిగించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశారు. అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్ఐ సరిత, కొయ్యూరు పోలీసులు, మల్హర్, కాటారం మండలాల రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.