Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిధుల విడుదలలో
సీఎం కేసీఆర్ వివక్ష : కాంగ్రెస్
నవతెలంగాణ-తాడ్వాయి
మేడారం రోడ్లకు మరమ్మతులు చేయడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పురుషోత్తమ్ నర్సింహులు అన్నారు. అవసరమైన మేరకు నిధులు విడుదల చేయకుండా సీఎం కేసీఆర్ వివక్ష చూపుతున్నారని నర్సింహులు విమర్వించారు. మేడారం జంపన్న వాగు ఆర్చి వద్ద గత వానాకాలంలో కొట్టుకుపోయిన రోడ్డును నర్సింహులు ఆధ్వర్యంలోని బృందం ఆదివారం సందర్శించింది. ఈ సందర్భంగా నర్సింహులు మాట్లాడారు. సీఎం కేసీఆర్ మేడారం మహాజాతరకు అనుగుణంగా కాకుండా తక్కువగా నిధులు కేటాయించాడని తెలిఆపరు. స్వరాష్ట్రం సిద్ధించినా కొత్త రోడ్లు వేయకపోగా పాత రోడ్లకు సైతం మరమ్మతులు చేపట్టడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. అనంతరం సీతక్క యువసేన మండల అధ్యక్షుడు చెర్ప రవీందర్ మాట్లాడుతూ మండలంలోని రోడ్లన్నీ కాంగ్రెస్ పాలనలో వేసినవేనని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక చేసిందేమీ లేదన్నారు. పస్రా నుంచి తాడ్వాయి, లింగాల, మేడారం, తాడ్వాయి నుంచి మేడారం, కాటాపూర్, బయక్కపేట, కాల్వపల్లి, ఏటూరునాగారం, తదితర రోడ్లన్నీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వేసినట్టు తెలిపారు. భవిష్యత్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు దుబాసి సుధాకర్, పురుషోత్తమ్ నారాయణ, స్వామి, చెర్ప వీరమోహన్రావు తదితరులు పాల్గొన్నారు