Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజేపీ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు అశోక్‌రెడ్డి
నవతెలంగాణ-ములుగు
రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఆగ్రహం నెలకొందని బీజేపీ ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్ర శివారులోని హరిత హోటల్లో జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా అశోక్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, అక్రమాలతోపాటు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. జిల్లాలోని అన్ని బూత్‌ల్లో పార్టీని బలోపేతం చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు వన్నాల శ్రీరాములు, ఏనుగు రాకేష్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, ఉషాకిరణ్, తాటి కష్ణ, రాజు నాయక్, నగరపు రమేష్, గాజుల కష్ణ, అడప భిక్షపతి, ఏనుగు రవీందర్‌రెడ్డి, నరేష్, అల్లె జనార్ధన, రవీంద్రచారి, సాంబశివరెడ్డి, స్వప్న, పొదెం రవీందర్, జాడి లక్ష్మీ, పోరిక ఉత్తమ్‌కుమార్, వాసుదేవరెడ్డి, జినుకల కృష్ణాకర్‌రావు, చల్ల మహేందర్, కొత్త సురేందర్, తదితరులు పాల్గొన్నారు.