Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడ
స్నేహబంధం పరిమళించింది. తమతో పాటు టెన్త్ చదువుకున్న స్నేహితుడు అనారోగ్యంతో బాధపడుతుండగా అండగా ఉంటామంటూ రూ.17 వేల 500లు సాయం అందించారు. వివరాలిలా.. మండల కేంద్రం లోని గిరిజన ఆశ్రమ హైస్కూల్లో 1997-98లో టెన్త్ చదువుకున్న స్నేహితులు మండలంలోని గుంజేడు ముసలమ్మ సన్నిధిలో ఆదివారం కలుసుకుని పూర్వవిద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా తమతో కలిసి టెన్త్ చదువుకున్న ఈక సారంగపాణి, సుదర్శన్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకుని తమ వంతుగా రూ.17 వేల 500లు సాయం అందించి ఉదారత చాటుకున్నారు. భవిష్యత్‌లోనూ ఒకరికొకరు తోడుగా ఉంటామని భరోసా కల్పించారు.