Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాడ్వాయి
తెలంగాణ ఐటీ శాఖ కమిషనర్ భాస్కర్ మేడారంలోని సమ్మక్క సార లమ్మ వనదేవతలను కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భాస్కర్ కుటుంబీకులకు మేడారం పూజారులు, ఎండోమెంట్ అధికారులు డోలు వాయిద్యాలతో ఆలయ సంప్రదాయం ప్రకా రం ఘనంగా స్వాగతం పలికారు. సమ్మక్క సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవింద రాజులకు భాస్కర్ పసుపు, కుంకుమ, చీరె, సారె, గాజులు సమర్పించి మొక్కు లు చెల్లించారు. అనంతరం సమ్మక్క సారలమ్మ పైడిరాజు గోవిందరాజుల జీవిత చరిత్ర మేడారం విశిష్టత గురించి తెలుసుకున్నారు. తదనంతరం ఎండోమెంట్ అధికారులు, పూజారులు శాలువాలతో సత్కరించారు.