Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
ఈనెల 20 నుంచి రెండ్రోజులపాటు మండల కేంద్రంలోని సత్తార్మియా నగర్లో సీపీఐ(ఎం) రెండో జిల్లా మహాసభలు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ మండల కార్యదర్శివర్గ సభ్యుడు గడ్డిపాటి రాజారావు తెలిపారు. మండలంలోని సీతంపేటలో జిల్లా మహాసభల వాల్పోస్టర్ను ఆదివారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. నిరంతరం ప్రజాసమస్యల పరిష్కారానికి అలుపెరుగని పోరాటాలు చేస్తున్న పార్టీ పాలకుల తప్పుడు విధానాలపై భవిష్యత్లో చేపట్టాల్సిన తెలిపారు. మహాసభల్లో అసంఘటిత రంగ కార్మికులు, రైతులు, కూలీలు, నిరుద్యోగుల సమస్యలపై చర్చిస్తారని వివరించారు. మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు అంబటి వీరస్వామి, ధరావత్ కైబాబు, శంకర్, వెంకటేశ్వర్లు, బాల్యా తదితరులు పాల్గొన్నారు.