Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రైతుల విజయం చరిత్రాత్మకం : ఏఐకేఎంఎస్
నవతెలంగాణ-బయ్యారం
రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు సాగించిన పోరాటాల ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి రైతు వ్యతి రక చట్టాలను రద్దు చేసిందని ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయ కుడు నందగిరి వెంకటేశ్వర్లు అన్నారు. రైతుల విజయం చరిత్రాత్మకమని కొనియాడారు. మండలంలోని బాలాజీ పేటలో రైతాంగ విజయోత్సవ సభ నిర్వహించగా వెంకటేశ్వర్లు మాట్లాడారు. రైతులు నిర్బంధాలను, లాఠీ ఛార్జీలను, బాష్పవాయు గోళాల ప్రయోగాన్ని, పోలీసు కాల్పులను ఎదుర్కొన్నట్టు తెలిపారు. సుమారు 700 మంది ప్రాణాలర్పించారని చెప్పారు. రైతుల పోరాటాన్ని అణచి వేయడానికి కేంద్ర ప్రభుత్వం అనేక విధాలుగా యత్నించినా రైతులు మొక్కవోని దీక్ష, సహనం, పట్టుదలతో పోరాడినట్టు వివరించారు. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి రైతు వ్యతిరేక చట్టాల రద్దుకు నిర్ణయించిందని తెలిపారు. పోరాటంలో భాగస్వాములైన రైతాంగానికి విప్లవ జేజేలు పలికారు. పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన రైతు అమరు లకు జోహార్లర్పించారు. ఢిల్లీ రైతుల స్ఫూర్తితో రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఐక్యపోరాటాలు కొనసాగించా లని కోరారు. కార్యక్రమంలో నాయకులు తోకల వెంకన్న, రామచంద్రుల మురళీ, కొత్త రామదాసు, ఎర్రమళ్ల వెంకన్న, ఖుషి వెంకన్న, గుడిబయిన రమేష్, గోవర్ధన్, గోగుల సాయి, వెంకటేష్, లక్ష్మీనారాయణ, సత్యం పాల్గొన్నారు.