Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
పేదలను ఆదుకునేందుకే సీఎంఆర్ఎఫ్ను రాష్ట్ర ప్రభుత్వం సమర్ధవంతంగా వినియో గిస్తోందని టీఆర్ఎస్ పార్టీ పెద్దవంగర మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య తెలిపారు. మండలంలోని బావోజీతండా పరిధిలోని కిష్టుతండాకు చెందిన జాటోత్ లాల్యకు మంత్రి దయాకర్‌రావు సహకారంతో మంజూరైన రూ.60 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఆదివారం ఐలయ్య అందించారు. అనంతరం ఐలయ్య మాట్లాడారు. పేదలు సీఎంఆర్ఎఫ్, ఇతర ప్రభుత్వం సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి శ్రీరాం సంజరు, చిన్నవంగర గ్రామ రైతు కోఆర్డినేటర్ పాకనాటి ఉపేందర్‌రెడ్డి, పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు బానోత్ శీను, రైతు విభాగం మండల జనరల్ సెక్రెటరీ బానోత్ గోపాల్, గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి జాటోత్ సీతారాం, మండల కార్యవర్గ సభ్యుడు బానోత్ హట్యా, వార్డ్ సభ్యుడు లాక్య రవి, ధరవత్ వెంకన్న, ఎస్టీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి జాటోత్ రవీందర్, బానోత్ కిష్టు శ్రీను, తదితరులు పాల్గొన్నారు.