Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంపీపీ కందకట్ల కళావతి
నవతెలంగాణ-సంగెం
అన్ని దానాలలో కెల్ల రక్తదానం మిన్నని ఎంపీపీ కందకట్ల కళావతి అన్నారు. ఆదివారం స్థానిక ఎంపీపీ కార్యాలయంలో యువసంకల్ప స్వచ్చంధ సంస్థ రెందో వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు. ఈ సందర్భంగా రక్తదాతలను అభినందించారు. ఈ శిబిరంలో 30యూనిట్ల రక్తాని సేకరించి ఎంజీఎం బ్లడ్ బ్యాంక్‌కు అందజేసినట్టు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తెలిపారు. రైతు బంధు మండలాధ్యక్షుడు కందకట్ల నరహరి, సర్పంచ్ గుండేటి బాబు, ఎంపీటీసీ మల్లయ్య, జాగతి వరంగల్ జిల్లా అధ్యక్షుడు యార బాలకష్ణ, ఎల్గుర్ రంగంపేట సర్పంచ్ పోతుల ప్రభాకర్, ఎంపీటీసీ పద్మ శ్రీనివాస్, ఎన్జీఓ అధ్యక్షుడు మండల పరమేష్, వరంగల్ జిల్లా అధ్యక్షురాలు మేధరి భవాని, ప్రధాన కార్యదర్శి చింతల రాజు కుమార్, ఉమ్మడి జిల్లా కన్వీనర్ చిర్రా రాజు, ఉపాధ్యక్షులు మండల శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు పెండ్లి పురుషోత్తం, మేకల శ్రవణ్, పోడేటి ప్రశాంత్, ఇమ్మడి సుమన్, శాతారాసి సనత్, విజేందర్, ప్రవీణ్, తేజ, ధీరజ్, దిలీప్, బొంత శేఖర్, రమేష్, ఎంజీఎం డాక్టర్ ప్రసాద్, యువకులు పాల్గొన్నారు.